SRH vs PBKS: ఐపీఎల్ 2024 సీజన్ ముగింపుకొచ్చేసింది. లీగ్స్ దశలో ఇంకొన్ని మ్యాచ్‌లే మిగిలివున్నాయి. ఢిల్లీ కేపిటల్స్ మినహా మిగిలినవన్నీ కూడా తమ చివరి మ్యాచ్‌లను ఆడుతున్నాయి. ఢిల్లీ కేపిటల్స్ తన చిట్టచివరి మ్యాచ్‌ను ఆడేసింది. లీగ్స్ దశలో అన్ని మ్యాచ్‌లనూ ఆడేసిన మొట్టమొదటి జట్టు అదే.
![]() |
DC vs LSG: ఢిల్లీ గెలిచింది.. నిలిచింది |
తన సొంత గడ్డపై జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై విజయదుందుభి మోగించింది. గెలుపుతో ఈ సీజన్‌కు ముగింపు పలికింది. మంగళవారం రాత్రి ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌ను 19 పరుగుల తేడాతో మట్టికరిపించింది రిషభ్ సేన. తొలుత బ్యాటింగ్‌కు నిర్ణీత 20 ఓవర్లల్లో నాలుగు వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. అనంతరం లక్నోను 189 పరుగులకు కట్టడి చేయగలిగింది.\
పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఇంకా రెండేసి చొప్పున మ్యాచ్‌లు ఉన్నాయి. నేడు పంజాబ్ కింగ్స్- రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. గువాహటి దీనికి వేదిక. ఈ సాయంత్రం 7: 30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. రాజస్థాన్ రాయల్స్ ఇప్పటికే ప్లేఆఫ్స్ చేరడం, గెలిచినా పంజాబ్ కింగ్స్‌కు పెద్దగా ఉపయోగపడకపోవడం ఈ మ్యాచ్ ప్రత్యేకత.
ఈ నెల 19వ తేదీన లీగ్స్‌లో తన చిట్టచివరి మ్యాచ్ ఆడబోతోంది పంజాబ్ కింగ్స్. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఢీ కొట్టనుంది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం దీనికి ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. సన్‌రైజర్స్‌కు కూడా ఇదే చివరి మ్యాచ్. అంతకంటే ముందు ఈ నెల 16వ తేదీన గుజరాత్ టైటాన్స్‌తో లీగ్స్ ఆడాల్సి ఉంది.
సన్‌రైజర్స్ మాటెలా ఉన్నప్పటికీ- పంజాబ్ కింగ్స్ తుదిజట్టులో మాత్రం భారీగా మార్పులు ఉండొచ్చు. సగానికి సగం కొత్త ముఖాలు కనిపించవచ్చు. ఆ ఫ్రాంఛైజీ తరఫున ఆడుతున్న ఓవర్సీస్ ప్లేయర్లందరూ టీ20 వరల్డ్ కప్ 2024 సన్నాహకాల కోసం తమ దేశాలకు వెళ్లిపోనున్నారు
కగిసొ రబడ- దక్షిణాఫ్రికాతో పాటు ఇంగ్లాండ్ ప్లేయర్లు సామ్ కుర్రన్, జానీ బెయిర్ స్టో, లియామ్ లివింగ్‌స్టొన్, క్రిస్ వోక్స్.. తమ దేశాలకు తిరుగుముఖం పట్టనున్నారు. వారి స్థానంలో రిజర్వుడ్ ప్లేయర్లను ఆడించనుంది పంజాబ్ కింగ్స్. కేప్టెన్ శిఖర్ ధావన్.. ఇదివరకే జట్టుకు దూరం అయ్యాడు. చెప్పుకోదగ్గ స్టార్లు లేని పంజాబ్ కింగ్స్‌పై అలవోకగా విజయం సాధించడం సన్‌రైజర్స్‌కు దాదాపు ఖాయమైనట్టే
0 Comments:
Post a Comment